హత్యకు గురైన యువకుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే
కొడిమ్యాల మండలం పూడూరు గ్రామానికి చెందిన కందుల రాజశేఖర్ అనే యువకుడిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి దారుణంగా హత్య చేసారు, విషయం తెలుసుకొని స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి మంగళవారం కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. అనంతరం ఆయన మాట్లాడుతూ హత్య చేసిన హంతకులకు కచ్చితంగా శిక్ష పడేలా ప్రభుత్వం తరపున చర్యలు తీసుకుంటామని, కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.