విద్యుత్ ఘాతంతో షఫీ మృతి
మహారాష్ట్ర నుండి వచ్చిన షేక్ షఫీ(38) కోరుట్ల పట్టణంలోని హాజీపురలో నివాసం ఉంటున్నాడు. ఝాన్సీ రోడ్డులో శనివారం ఉదయం ఓ పిల్లర్ కోసం తవ్విన గుంత నుంచి నీటిని కరెంట్ మోటార్ తో బయటికి తోడే పనిలో ఉండగా, కాళ్లకు కరెంట్ వైరు తగిలి నీటి గుంతలో పడింది. గుంతలో ఉన్న షేక్ షఫీకి కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్సై శ్రీకాంత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.