కూడు,గుడ్డ, నీడ - రాజ్యాంగ హక్కు
పుట్టిన ప్రతి వ్యక్తికి కూడు, గుడ్డ, నీడ రాజ్యాంగం కల్పించిన హక్కు అని తెలంగాణ గిరిజన సంఘము రాష్ట్ర ఉపాధ్యక్షుడు భీమా సాహెబ్ అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణ శివారులో జంబి వద్ద 32 రోజులుగా ఇళ్లస్థలాల కోసం నిరుపేదలు నిర్వహిస్తున్న పోరాట శిబిరాన్ని ఆయన సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా భీమా సాహెబ్ మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెద్దలకు కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములను అప్పనంగా అప్పజెప్తున్న ప్రభుత్వాలు. పేదలకు 100 గజాల ఇంటి జాగా ఇవ్వడానికి ఎందుకు వెనుకడుగు వస్తుందని ప్రశ్నించారు. మండుటెండలో పేదలు ఇంత పోరాటం చేస్తుంటే ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని అన్నారు తక్షణమే అర్హులైన పేదలను ఆదుకోవాలని కేసులు బనయించడం అలసివేయాలని ఆలోచించే ధోరణిని ప్రభుత్వ విరమించుకోవాలని కోరారు లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు మద్దతుగా ఉద్యమిస్తామని హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కన్వీనర్ జి. తిరుపతి నాయక్, పూలే అంబేడ్కర్ నగరం ఇండ్ల స్థలాల పోరాట కన్వీనర్ గుమ్మడి రమేష్, ఇండ్ల స్థలాల పోరాట కమిటీ రజియా సుల్తానా కాసం యశోద, నాగరాజు, పోషన్న, శివ, లొకిని రాజశేకర్ జి. తిరుపతి నాయక్ సిపిఎం జగిత్యాల జిల్లా కన్వీనర్ పాల్గొన్నారు.