ISRO నూతన ఛైర్మన్గా నారాయణన్
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) తదుపరి చైర్మన్గా డాక్టర్ వీ నారాయణన్ నియమితులయ్యారు. దీనిపై మంగళవారం అధికారిక ప్రకటన వెలువడింది. ఇస్రో ప్రస్తుత చీఫ్ ఎస్.సోమనాథ్ నుంచి ఆయన జనవరి 14న బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇస్రోలో డాక్టర్ వి నారాయణన్ ప్రస్తుతం లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ (LPSC) డైరెక్టర్గా ఉన్నారు. రాకెట్ - అంతరిక్ష నౌక ప్రొపల్షన్ విభాగంలో ఆయనకు విశేష అనుభవం ఉంది.