ఏపీ ప్రజల తరఫున ప్రధాని మోదీకి స్వాగతం అంటూ సీఎం చంద్రబాబు మంగళవారం ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు. "రాష్ట్ర పర్యటనకు వస్తున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి రాష్ట్ర ప్రజల తరపున స్వాగతం పలుకుతున్నాను. రూ.2 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగే రేపటి కార్యక్రమం రాష్ట్రాభివృద్దిలో కీలక ముందడుగు. మీకు స్వయంగా స్వాగతం పలికేందుకు విశాఖ ప్రజలతో సహా మేమంతా ఎదురుచూస్తున్నాం." అని చంద్రబాబు రాసుకొచ్చారు.