మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా యెవ్లాలో 11 ఏళ్ల బాలికపై వీధి కుక్కలు మంగళవారం దాడి చేశాయి. పరి కర్వారం అనే బాలిక బడాపూర్ రోడ్డులో ఓ గ్రౌండ్‌లో నుంచి నడుచుకుంటూ వెళ్తోంది. తన వద్దకు వచ్చిన ఓ కుక్కను ఆమె కొట్టడానికి ప్రయత్నించింది. ఇంతలో మరో ఏడు కుక్కలు ఒక్కసారిగా ఆమె పైకి దూసుకొచ్చాయి. బాలిక మీద పడి అవి కరిచాయి. అదే సమయంలో కొందరు స్థానికులు బాలికను కాపాడి, హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.