క్రికెట్ చరిత్రలో ఓ అసాధారణ ఘటన చోటుచేసుకుంది. బిగ్ బాష్ లీగ్‌లో సిడ్నీ థండర్స్ టీమ్ అసిస్టెంట్ కోచ్ డాన్ క్రిస్టియన్ తుది జట్టులోకి చేరి బ్యాటింగ్ చేశాడు. జట్టులోని ఆటగాళ్లు బాన్‌క్రాఫ్ట్, డానియెల్ సామ్స్ ఫీల్డింగ్ చేస్తూ గాయపడడంతో, రిజర్వ్ ప్లేయర్లు కూడా ఫిట్నెస్ సమస్యల కారణంగా అందుబాటులో లేకపోవడంతో అతడు బరిలోకి దిగాడు. 17వ ఓవర్లో క్రీజులోకి వచ్చి 15 బంతుల్లో 153 స్ట్రైక్ రేట్‌తో 23 పరుగులు సాధించాడు.