తల్లి నిర్వాకం.. ఫాలోవర్లు, డబ్బు కోసం కూతురిపై..
ఆస్ట్రేలియాలో ఓ మహిళ (34) సోషల్ మీడియాలో ఫాలోవర్లు, డబ్బుల కోసం దారుణానికి పాల్పడింది. ఏడాది వయసున్న తన కూతురికి అనవసర ఔషధాలను ఇచ్చి అనారోగ్యానికి గురయ్యేలా చేసింది. చిన్నారి పడే బాధను ఫొటోలు, వీడియోల రూపంలో టిక్ టాక్ లో పోస్టు చేసి విరాళంగా $37,300ను పొందింది. అయితే బాలిక అనారోగ్యానికి గురవడంతో ఆస్పత్రిలో చేర్చగా అసలు విషయం బయటపడింది. పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. చిన్నారికి మెరుగైన వైద్యం అందిస్తున్నారు.