అన్ని రంగాల్లో సుల్తానాబాద్ ను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నట్టు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు అన్నారు. గురువారం సుల్తానాబాద్ మున్సిపల్ పూసాల 13వ వార్డులో ప్యాకేజీ- 8 ద్వారా టీయూ ఎఫ్ఐడీసీ కింద రూ. 38లక్షల అంచనాతో నిర్మించే నాలుగు సీసీ రోడ్లు, స్ట్రోమ్ వాటర్ డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గాజుల లక్ష్మి రాజమల్లు పాల్గొన్నారు.