ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు మరువలేనివి: కలెక్టర్

75చూసినవారు
ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు మరువలేనివని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కొనియాడారు. ఆచార్య కొండా లక్ష్మణ్ జయంతి వేడుకలను బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఐడిఓసిలో నిర్వహించగా, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ హాజరై ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్ర పటానికి జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, అధికారులు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.

ట్యాగ్స్ :