ఎవరు ఏమన్నా జగన్ మాత్రం తన రూటే సెపరేట్ అన్నట్లు ఉంటారు. పార్టీ నుంచి ఎంతమంది వెళ్ళినా ఆయన మాత్రం ఉన్న వారితోనే అంటున్నారు. అయితే అన్ని జిల్లాలకు అధ్యక్షులను నియమించిన తరువాత నియోజకవర్గాలకు ఇంచార్జిలను నియమించి అప్పుడు జనంలోకి వెళ్ళాలని చూస్తున్నారు. ఈ మొత్తం ప్రాసెస్ పూర్తి అయ్యేసరికి ఈ ఏడాది పూర్తి కావచ్చని అంటున్నారు. అంటే జగన్ సంక్రాంతి పండుగ తరువాత జనంలోకి వెళ్లాలని అనుకుంటున్నారని పార్టీ వర్గాల్లో సమాచారం.