నేడు మద్యం షాపులకు నోటిఫికేషన్?

84చూసినవారు
నేడు మద్యం షాపులకు నోటిఫికేషన్?
నూతన మద్యం పాలసీకి సంబంధించి శుక్రవారం నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. మొత్తం 3,736 వైన్ షాపులను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో 340 మద్యం దుకాణాలను గీత కార్మికులకు కేటాయించనున్నారు. ఒక వ్యక్తి ఎక్కడి నుంచైనా.. ఎన్ని దుకాణాలకైనా దరఖాస్తు చేసుకోవచ్చు. 10 వేలలోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.50 లక్షలు, 50 వేలలోపు ఉంటే రూ.55 లక్షలు, 5 లక్షల లోపు ఉంటే రూ.65 లక్షలు, 5 లక్షల పైన ఉంటే రూ.85 లక్షల లైసెన్స్ ఫీజును ప్రభుత్వం నిర్ణయించింది.

సంబంధిత పోస్ట్