ఎక్సైజ్ కానిస్టేబుల్ ఆత్మహత్య
కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలో విషాదం చోటు చేసుకుంది. వీణవంక మండలం ఎల్భాక గ్రామానికి చెందిన బొల్లం దేవేందర్ రెడ్డి(30) కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. కానిస్టేబుల్ బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 3 నెలల క్రితమే మృతుడు కానిస్టేబుల్ జాబ్ లో జాయిన్ అయ్యాడు. ఇంతలోనే ఆత్మహత్యకు పాల్పడటంపై పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.