ప్రపంచంలోనే ఒక రకమైన వంటకానికి కొన్ని లక్షలు ఖర్చవుతుందని మీకు తెలుసా..? ఈ ఆహారం బంగారం కంటే 50 రెట్లు ఎక్కువగా ఉంటుంది. దీని పేరు అల్మాస్ కేవియర్. కేవియర్ అనేది స్టర్జన్ చేపల అండాశయాలలో కనిపించే గుడ్లు. ఈ గుడ్ల ధర కిలోకి రూ.28.74 లక్షలు ఉంటుందట. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ సి, ఎ, ఇ, జింక్, ఐరన్ వంటివి పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా రోమన్, గ్రీకు రాజుల కాలంలో ఈ గుడ్లతో వంటకాలు చేసేవారట. వాటిని 'రాయల్ డిష్' అని పిలిచేవారట.