ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై ప్రకాశ్ రాజ్ మరోసారి పరోక్షంగా సెటైర్లు వేశారు. ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ.. ‘తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ సమానత్వం గురించి మాట్లాడితే.. మరొక డిప్యూటీ సీఎం సనాతనం అంటూ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. మాది సమానత్వం. నేను ఎప్పటికీ బలహీన వర్గాల తరఫున మాట్లాడుతాను. నేను ప్రశ్నిస్తే భయపడుతున్నారు.’ అని అన్నారు.