మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందచేత
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బొంగోని రాజయ్య గౌడ్ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా మండల బిజెపి నాయకులు ఉడుత కుమార్ మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. మంగళవారం బాధిత కుటుంబానికి 50 కిలోల బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాపర్తి నాగర్జున, కారుపాకల శ్రీకాంత్, జాన అరవింద్, రాపర్తి సాయి, నరకుడు, స్వామి, తదితరులు పాల్గొన్నారు.