వెల్గటూరు: అనుమానాస్పద స్థితిలో యువకుని మృతి
వెల్గటూరు మండలం మొక్కట్రావుపేట గ్రామానికి చెందిన మేకల రాజయ్య తండ్రి రాయపోశయ్య 40 సంవత్సరాల యువకుడు సోమవారం ఉదయం అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు వెల్గటూరు ఎస్ఐ రాపెల్లి ఉమా సాగర్ తెలిపారు. మృతుడి తమ్ముడు మేకల మహేష్ తండ్రి రాయపోషయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శవాన్ని పోస్టుమార్టం కు పంపి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడు తాగుడుకు బానిసైనట్లు వారు తెలిపారు.