ఓ యువ జంటపై కొందరు దుండగులు దారుణంగా దాడి చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ సంఘటన బిహార్లోని జముయి జిల్లాలోని టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దౌలత్పూర్లో జరిగింది. ఓ జంట కొండపై ఏకాంతంగా కూర్చొని ఉండగా, అటుగా వచ్చిన కొందరు యువకులు వారిపై దాడి చేశారు. ఇద్దరు బాధితులు కొట్టవద్దని వేడుకున్నా యువకులు వినకుండా వారిని దారుణంగా కొట్టారు. అయితే, దీనిపై ఎటువంటి కేసు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు.