జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం సిరికొండకు చెందిన తిరుమలేశ్ (18) అనే యువకుడు గత మూడు రోజుల క్రితం గ్రామ శివారు వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడగా మృతదేహం ఆదివారం లభ్యం అయ్యింది. గత మూడు రోజుల నుండి కనబడకపోగా కుటుంబ సభ్యులు తిరుమలేశ్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు. అయితే ఆదివారం యువకుడు బావిలో శవమై తేలడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇతని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.