వేములవాడ రాజన్న సన్నిధిలో మంగళవారం హుండీ లెక్కింపు కార్యక్రమం ఉన్నదని ఆలయ ఈవో వినోద్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 8 గంటలకు హుండీ ఆదాయం లెక్కింపు కార్యక్రమాన్ని సీసీ కెమెరాలు, ఎస్పీఎఫ్ సిబ్బంది పర్యవేక్షణలో ఉంటుందని చెప్పారు. ప్రతి నెల 15 నుంచి 20 రోజుల వ్యవధిలో హుండీ ఆదాయం లెక్కింపు కార్యక్రమాన్ని చేస్తున్నట్లు వెల్లడించారు.