నిగమ్‌బోధ్‌ ఘాట్‌కు చేరుకున్న మన్మోహన్ పార్థివదేహం

73చూసినవారు
నిగమ్‌బోధ్‌ ఘాట్‌కు చేరుకున్న మన్మోహన్ పార్థివదేహం
భారత మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్ అంతిమయాత్ర ముగిసింది. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర నిగమ్‌బోధ్‌ ఘాట్‌‌కు చేరుకుంది. మరికాసేపట్లో ఇక్కడ ప్రభుత్వ లాంఛనాలతో మన్మోహన్‌ సింగ్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా అంతిమ యాత్రలో ఖర్గె, రాహుల్, తెలంగాణ సీఎం రేవంత్, సిద్ధరామయ్య, కాంగ్రెస్ నేతలు, అభిమానులు భారీగా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్