ఎమ్మెల్యేలు పార్టీ మారడంపై KCR కీలక వ్యాఖ్యలు

56చూసినవారు
ఎమ్మెల్యేలు పార్టీ మారడంపై KCR కీలక వ్యాఖ్యలు
ఎమ్మెల్యేలు పార్టీ మారడంపై మాజీ సీఎం KCR కీలక వ్యాఖ్యలు చేశారు. ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ఇటీవల పార్టీ మారడంపై మాట్లాడారు. 'సంజయ్.. రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన BRSను విడిచి వెళ్లారు. 2001లో పార్టీ పెట్టినప్పుడు సంజయ్ లేరు. మధ్యలో పార్టీలోకి వచ్చిన వారు మధ్యలోనే వెళ్ళిపోతారు. అలాంటి వారితో పార్టీకి ఎలాంటి నష్టం ఉండదు' అని అన్నారు.