Oct 29, 2024, 04:10 IST/వైరా
వైరా
వైరా: కామేపల్లికి చేరుకున్న పాదయాత్ర
Oct 29, 2024, 04:10 IST
ఎస్సీ రిజర్వేషన్ ఏబీసీడీ వర్గీకరణ నిలుపుదల చేయాలని భద్రాచలం నుంచి హైదరాబాద్ వరకు చేపట్టిన మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ చేపట్టిన పాదయాత్ర సోమవారం కామేపల్లి మండలం కొత్తలింగాల గ్రామానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఎస్సీ వర్గీకరణ పూర్తిగా రద్దు చేసే వరకు పోరాటం ఆగదన్నారు. మండల అధ్యక్షుడు రమేష్, నాయకులు ఆంతోటి అచ్చయ్య, దారా సుందర్ రావు, బెంజిమెన్, అన్వేష్ పాల్గొన్నారు.