పంటలకు వెంటనే నీరు అందించాలి

1495చూసినవారు
ఖమ్మం జిల్లా బోనకల్ మండలం ఆలపాడు, గోవిందపురం, రాయన్నపేట, మోటమర్రి రైతులు పంటలకు నీరందించాలని మంగళవారం దీక్ష చేపట్టారు. వేసిన మొక్కజొన్న పంటలు ఎండిపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు పట్టించుకోని టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారులు రైతులను నిండా ముంచే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అధికార పార్టీ నాయకుల నిర్లక్ష్యంతోనే రైతుల మొక్కజొన్న పంటకు నీరందక ఎండిపోతున్నాయని అన్నారు. ఇప్పటికైనా అధికార పార్టీ నాయకులు, అధికారులు రైతులకు వెంటనే నీటిని విడుదల చేసి రైతులని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ధర్నాలు ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. దీక్షలో ఆలపాడు సర్పంచ్ తో పాటు రైతులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్