ఖమ్మంలో బీఆర్ఎస్ శ్రేణుల సందడి

82చూసినవారు
ఖమ్మం నగరంలోని కాల్వఒడ్డు వద్ద మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి. మరి కొద్దిసేపట్లో సీఎం కేసీఆర్ ఖమ్మం నగరానికి చేరుకోనున్నారు. కెసిఆర్ రాక నేపథ్యంలో పట్టణం మొత్తం గులాబీమయంగా మారింది. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం నగరంలో కేసీఆర్ రోడ్ షో జరగనుంది. కాల్వఒడ్డు నుండి జెడ్పీ సెంటర్ వరకు కొనసాగుతుంది.