ఉక్రెయిన్‌కు సాయంగా అమెరికా కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కీవ్‌కు మద్దతుగా అమెరికా మిలటరీ కాంట్రాక్టర్లను తరలించేందుకు బైడెన్ సర్కారు సన్నాహాలు చేస్తోంది. దీంతో ఇప్పటివరకు అమల్లో ఉన్న అప్రకటిత నిషేధాన్ని తొలగించనున్నట్లు సీఎన్‌ఎన్ కథనంలో పేర్కొంది.ఉక్రెయిన్ పాలసీకి సంబంధించి అమెరికా తీసుకున్న కీలక నిర్ణయాల్లో ఇది కూడా ఒకటిగా నిలవనుంది. రష్యాపై కీవ్ ఆధిపత్యం సాధించేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని భావిస్తోంది.