లండన్‌లోని హీత్రూ విమానాశ్రయంలో మరోసారి సాంకేతిక సమస్య తలెత్తింది. ఫలితంగా భారీ సంఖ్యలో విమాన సర్వీసులపై ప్రభావం పడింది. దీంతో వేల మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్టులో పడిగాపులు కాస్తున్నట్లు డెయిలీమెయిల్ కథనంలో పేర్కొంది. దీంతో వారి ప్రయాణాలు ఎప్పుడు మొదలవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. దీనిపై బ్రిటీష్ ఎయిర్‌వేస్ స్పందించింది. తమ సంస్థ నిపుణులు సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారని ప్రకటించింది.