అదుపుతప్పి పంట పొలాల్లో దూసుకెళ్లిన కారు
ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీ పరిధిలోని మడుపల్లి గ్రామం నుండి మధిర పట్టణానికి వచ్చే ప్రధాన రహదారిపై బుధవారం ఉదయం ఒక కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ప్రజలు గమనించి గాయపడిన వ్యక్తిని మధిర ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.