ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ రైలులో మహిళ ప్రసవం

63చూసినవారు
ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ రైలులో మహిళ ప్రసవం
ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. హజ్రాత్ నిజాముద్దీన్-తిరుపతి మధ్య రాకపోకలు సాగించే ఈ రైలులో ప్రయాణిస్తున్న ఓ గర్భిణికి పురిటినొప్పులు మొదలయ్యాయి. రైల్వేసిబ్బంది, తోటి ప్రయాణికులు అప్రమత్తమై కదులుతున్న రైలులోనే ఆమెకు డెలివరీ చేశారు. తల్లీ బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగానే ఉన్నారు. ఈ విషయాన్ని రైల్వే మంత్రిత్వశాఖ ‘ఎక్స్'లో షేర్ చేసింది.

సంబంధిత పోస్ట్