కాలువ పునరుద్ధరణ పనులు వేగంగా చేయాలని కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ ఆదేశించారు. పాలేరు సమీపంలో హఠ్యతండాకు వెళ్లే రోడ్డు వద్ద సాగర్ ఎడమ కాలువకు ఇటీవల కురిసిన వర్షాలతో గండి పడింది. దాంతో రైతుల పొలాలు నీటమునిగి ఇసుక మేటలు వేశాయి. ఈ కాలువ మరమ్మతు పనులను అధికారులు చేపట్టగా శుక్రవారం కలెక్టర్ పరిశీలించారు. అనంతరం పనులపై ఆరా తీశారు. వీలైనంత తొందరగా కాలువ పునరుద్ధరణ పనులు పూర్తి చేయాలని అధికారులను కోరారు.