పోలీసులు సమర్థవంతంగా విధులను నిర్వహిస్తూ పోలీస్ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కల్గించాలని డీసీపీ (లాఅండ్ ఆర్డర్) ప్రసాదరావు అన్నారు. మంగళవారం కూసుమంచి పోలీస్ స్టేషన్ తో పాటు సీఐ కార్యాలయాన్ని ఆయన సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు. అలాగే పోలీస్ స్టేషన్ నిర్వహణ, నేరాల నియంత్రణకు పోలీసులు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నాక మాట్లాడారు. స్టేషన్ పరిసరాలను ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా చూడాలన్నారు.