రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కల్లూరు మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామపంచాయతీ పరిధిలోని అడవి బోడిమల్లెలో ప్రతాపరెడ్డి రేకుల ఇల్లు నేలకూలింది. ఏడాది క్రితం కొడుకు మరణించగా, అ పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ తండ్రి ఇల్లు కోల్పోవడంతో కట్టుబట్టలే మిగిలాయి. ధీనస్థితిలో ఉన్న నిరుపేద తనను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నాడు.