తల్లాడ: బైక్ ను బస్సు ఢీకొట్టి యువకుడు మృతి
తల్లాడ మండలంలోని అంబేడ్కర్ నగర్ గ్రామం వద్ద ఆదివారం రాత్రి మోటార్ సైకిల్ ను ఆర్టీసీ బస్సు ఎదురుగా వచ్చి ఢీకొట్టడంతో యువకుడు మృతి చెందాడు. బిల్లుపాడుకు చెందిన నల్లగట్ల జయరాజు (35)పల్లిపాడుకు మోటార్ సైకిల్ పై వెళ్తుండగా ఖమ్మం నుంచి కొత్తగూడెం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. జయరాజుకు తీవ్ర గాయాలు కాగా 108 ద్వారా ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందాడు.