వైరాలో ఈనెల 15వ తేదీన జరగబోయే సీఎం సభను మనమంతా పండగలా జరుపుకుందామని కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండల కేంద్రంలోని ఆర్బీ గార్డెన్ లో నాయకులు, కార్యకర్తలతో సోమవారం ఆయన సమావేశమయ్యారు. రూ. 2లక్షల రైతు రుణమాఫీ నిధులు విడుదల, సీతారామ ప్రాజెక్టు ద్వారా సాగునీటిని ముఖ్యమంత్రి చేతుల మీదుగా విడుదల చేయనున్నట్లు చెప్పారు.