సత్తుపల్లి నియోజకవర్గంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ మండల కేంద్రాలలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో శనివారం 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో ఆ మండలాల అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, అందరూ కలిసి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పాల్గొని, అభినందనలు తెలియ చేసుకొని మిఠాయిలు పంచుకున్నారు.