సింగరేణి మండల కేంద్రంలో శుక్రవారం ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా ఆదివాసులు బస్టాండ్ సెంటర్ నుంచి అంబేద్కర్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించి, అనంతరం కొమరం భీం విగ్రహానికి పూలమాలవేసి, కొబ్బరికాయలు కొట్టి, జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కల్తి రాంప్రసాద్, మాజీ సర్పంచ్ సత్యనారాయణ, శ్రీను, నరసింహారావు, రాంబాబు, మహిళలు పాల్గొన్నారు.