ముచ్చర్ల-ఏన్కూర్ రహదారిపై గుంతల పూడ్చివేత
కామేపల్లి మండలం ముచ్చర్ల క్రాస్ రోడ్డు-ఏన్కూర్ ఆర్అండ్ బీ ప్రధాన రహదారి గుంతలతో ప్రమాదకరంగా ఉండటంతో మద్దులపల్లి గ్రామానికి చెందిన ఆదెర్ల లక్ష్మీనారాయణ తన సొంత ఖర్చులతో ఆదివారం గుంతలను జేసీబీతో పూడ్చివేశారు. రోడ్డు ప్రమాదభరితంగా ఉండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయని, అందుకే మట్టి వేసి పూడ్చివేయించానని ఆయన తెలిపారు. అధికారులు స్పందించి శాశ్వత మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.