ప్రస్తుతం రీ రిలీజ్‌ల ట్రెండ్ కొనసాగుతోంది. ఇందులో భాగంగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మాస్ మహారాజ రవితేజ-ఇలియాన జంటగా నటించిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ 'కిక్' మరోసారి థియేటర్లలో రిలీజ్‌కు సిద్ధమైంది. మార్చి 1న ఈ మూవీని మేకర్స్ రీ రిలీజ్ చేయనున్నారు. కాగా రవితేజ ఇటీవల వెంకీ మూవీ రీ రిలీజ్‌తో ఆడియెన్స్‌ను విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.