మరోసారి కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి

78చూసినవారు
మరోసారి కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి
తెలంగాణ నుంచి కిషన్ రెడ్డికి మరోసారి మోదీ మంత్రివర్గంలో చోటు దక్కింది. ఆయన మూడుసార్లు ఎమ్మెల్యేగా.. రెండు సార్లు ఎంపీగా గెలిచారు. 1977లో జనతాపార్టీ యువమోర్చా నాయకుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 2004లో తొలిసారి హిమాయత్‌నగర్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019 మే- 2021 జులై వరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా.. 2021 జులై నుంచి కేంద్ర సాంస్కృతిక, పర్యటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా పని చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్