ప్యారిస్ ఒలింపిక్స్‌లో పతకాల వేటకు సిద్ధమైన అథ్లెట్ల బృందానికి క్రికెటర్ విరాట్ కోహ్లీ ఓ వీడియో సందేశం పంపారు. జులై 26న విశ్వ క్రీడల ఆరంభం కానున్న నేపథ్యంలో కోట్లాది మంది భారతీయుల కలల్ని మోసుకెళ్లిన భారత స్క్వాడ్ కు ‘ఆల్ ది బెస్ట్’ చెప్పారు. ఒలిపింక్ సైన్యానికి యావత్ భారతం మద్దతుగా నిలవాలని విరాట్ పిలుపునిచ్చాడు. ఇలాంటి గొప్ప దేశానికి అవసరమైన పెద్ద విజయం ఏం కావాలి? ఎక్కువ బంగారం, వెండి, కాంస్య పతకాలు అంతే అని అన్నాడు.