ఎలాంటి అనుమతులు లేకుండా ఎద్దులు, బర్రెలు తరలిస్తున్న నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు రెబ్బెన ఎస్సై చంద్రశేఖర్ శుక్రవారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం రెబ్బెన మండలం కాగజ్ నగర్ క్రాస్ రోడ్ వద్ద శుక్రవారం వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో కౌటాల నుండి హైదరాబాద్ వెళుతున్న టీఎస్ 20 టి 2317 నెంబర్ గల ఐచర్ వ్యానులో 15 ఎద్దులు, 8 బర్రెలు అనుమతులు లేకుండా తీసుకువెళ్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు.