Top 10 viral news 🔥
VIDEO: తెలుగు భాషపై వైరలవుతోన్న పాట
ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటాం. అయితే ఈ ఏడాది ఆగస్టులో తెలుగు భాషా దినోత్సవం నాటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది. తెలుగు భాష కనుమరుగైపోతోందని ఓ పండితుడు పాడిన పాట నెట్టింట హల్చల్ చేస్తోంది. తాజాగా సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు ట్విట్టర్లో ఈ వీడియోను షేర్ చేశారు. దీనిని సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ వినాలని నాగేశ్వరారావు విజ్ఞప్తి చేశారు. 'తెలుగెక్కడుంది రా తెలుగోడా. నీ తెలుగు తెల్లారె తెలుగోడా' అంటూ ఆ పండితుడు పాడారు.