మున్నేరు ముంచేయకుండా హైవే ఎత్తు పెంపు!

73చూసినవారు
మున్నేరు ముంచేయకుండా హైవే ఎత్తు పెంపు!
మున్నేరుకు వరద వచ్చిన ప్రతిసారి విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి ముంపునకు గురవుతోంది. ఈ సమస్యపై NHAI తాజాగా దృష్టి పెట్టింది. ముంపు ప్రాంతంలో జాతీయ రహదారి ఎత్తు పెంచేందుకు యోచిస్తోంది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం సమీపంలో మున్నేరు వాగు పొంగి జాతీయ రహదారిపైకి చేరుతోంది. దీంతో తెలుగు రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోతున్నాయి. త్వరలో ఈ హైవేని ఆరు వరుసలుగా విస్తరించనున్నారు. ఈ క్రమంలోనే ఐతవరం వద్ద హైవే ఎత్తు పెంచేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్