గాజాపై ఇజ్రాయెల్ క్షిపణి దాడిలో 40 మంది మృతి.. 60 మందికి పైగా గాయాలు

84చూసినవారు
గాజాపై ఇజ్రాయెల్ క్షిపణి దాడిలో 40 మంది మృతి.. 60 మందికి పైగా గాయాలు
గాజాపై ఇజ్రాయెల్ సైన్యం సోమవారం మరోసారి వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో 40 మంది మరణించారు. మరో 60 మందికి పైగా పాలస్తీనీయులు తీవ్రంగా గాయపడ్డారు. గాజాలోని అల్-మవాసి క్యాంపుపై ఇజ్రాయెల్ సైన్యం దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. అయితే, హమాస్‌ కమాండ్‌ సెంటర్‌ను లక్ష్యంగా చేసుకుని మాత్రమే ఈ దాడులు చేశామంటూ ఇజ్రాయెల్ దళాలు పేర్కొన్నాయి.

సంబంధిత పోస్ట్