తెలంగాణ మీదుగా నడిచే ఐదో వందే భారత్ రైలును వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ

62చూసినవారు
తెలంగాణ మీదుగా నడిచే ఐదో వందే భారత్ రైలును వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ
తెలంగాణ నుంచి మరో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు పరుగులు పెట్టనుంది. సికింద్రాబాద్-నాగ్‌పూర్‌ స్టేషన్ల మధ్య ఈ సెమీ హైస్పీడ్ రైలు ప్రారంభం కాబోతుంది. దీనికి ముహూర్తం కూడా ఖరారు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ నెల 15వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ వందేభారత్‌ రైలు ప్రారంభం కాబోతుంది. ఆయన ఈ రైలు సర్వీసును వర్చువల్‌గా ప్రారంభిస్తారు. ఇప్పటికే తెలంగాణ నుంచి పలు ప్రాంతాలకు నాలుగు వందే భారత్‌ రైళ్లు నడుస్తున్నాయి.

సంబంధిత పోస్ట్