కాగజ్‌నగర్ పట్టణం ఎన్టీఆర్ చౌరస్తా సమీపంలో గల లిమ్రా చికెన్ సెంటర్ లో సోమవారం అర్ధరాత్రి ఒక దొంగ దుకాణంలోకి చొరబడి దొంగతనానికి పాల్పడాడు. మంగళవారం ఉదయం షాపు తెరిచిన యజమాని కౌంటర్లో చూడగా 54 వేల రూపాయల నగదు కనిపించలేదు. దీంతో యజమాని పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దుకాణంలోని సీసీ ఫూటేజ్ ఆధారంగా దొంగను పట్టుకునే పనిలో పడ్డారు.