మితిమీరిన స్పీడ్ బ్రేకర్ల నిర్మాణాలను ఆపాలి: సీపీఎం

57చూసినవారు
మితిమీరిన స్పీడ్ బ్రేకర్ల నిర్మాణాలను ఆపాలి: సీపీఎం
కాగజ్నగర్ పట్టణంలోని లారీ చౌరస్తా నుండి ఎస్పీఎం వర్కర్ గేటు వరకు ఎస్పీఎం యాజమాన్యం ఇప్పటికే 10 స్పీడ్ బ్రేకర్లు పెట్టారని, మళ్ళీ కొత్తగా స్పీడ్ బ్రేకర్లు వేస్తున్నారని సీపీఎం పార్టీ సిర్పూర్ నియోజవర్గ కన్వీనర్ ముంజం ఆనంద్ ఆరోపించారు. వీటి వలన బైక్ పైన ప్రయాణం చేసేవారికి ఇబ్బందులు ఉంటాయని, వాటిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని హెచ్చరించారు.