దీపావళికి ఉచిత సిలిండర్లు, మరుసటి రోజు ఫ్రీ బస్సు: చిత్తూరు ఎమ్మెల్యే
ఉచిత సిలిండర్లు, మహిళలకు ఫ్రీ బస్సు పథకంపై చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ కీలక ప్రకటన చేశారు. దీపావళికి ఉచిత సిలిండర్లు అమలు చేస్తామని, ఆ మరుసటి రోజు నుంచే మహిళలకు ఫ్రీ బస్సు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. మహిళల సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు పాటు పడుతున్నామని అన్నారు. పేదల కోసం రేషన్ కార్డులు, ఎన్టీఆర్ గృహాలు, మరిన్ని పింఛన్లు ఇస్తామని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ పేర్కొన్నారు.