బెజ్జూర్ మండలం కుష్ణపల్లి గ్రామానికి చెందిన కొడిపే శంకర్ సతీమణి ఇటీవలే పరమపదించారు. బుధవారం సిర్పూర్ శాసన సభ్యులు డా. పాల్వాయి హరీష్ బాబు వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్లానింగ్ కమిటీ బోర్డు మెంబర్ కోండ్ర మనోహర్ గౌడ్, ఎంపిపి కొప్పుల శంకర్, సామెర తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.