పైప్ లైన్ లీకేజీలతో పట్టణవాసుల అవస్థలు

73చూసినవారు
కాగజ్‌నగర్‌ పట్టణంలోని మున్సిపల్ పైప్ లైన్ లు సక్రమంగా లేకపోవడం వలన పలు కాలనీలలో ఎక్కడపడితే అక్కడ లీకేజీలు అవుతున్నాయని సీపీఎం పార్టీ పట్టణ కార్యదర్శి ముంజం ఆనంద్ ఆరోపించారు. స్టేషన్ రోడ్డు లైన్ లో కొన్ని నెలలుగా పలు చోట్ల పైపులు లీకేజీ అవుతుందని, మంగళవారం స్టేట్ బ్యాంక్ దగ్గర పైపులైన్ లీకేజ్ కావడంతో ఫ్లై ఓవర్ వరకు వరదలు పారుతున్నాయని అన్నారు. అధికారులు స్పందించి వెంటనే మరమత్తులు చేపట్టాలన్నారు‌.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్